Krishnaa profile
Creator Profile

Krishnaa

🪷కృష్ణస్య స చరాచరం🪷

30 Posts
2 Followers
15 Following
K
Krishnaa
Quote by Krishnaa - స్పందించే  ప్రతి హృదయం 
ఉదయించే రవి కిరణం

                    -- జాగృతి 🪷 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - హరివిల్లు వర్ణాల బంగారు భవితకై
బంధించె లోలోని అసమానతల్ని
రగిలించె తనలోని చైతన్య శక్తిని
చిందించె సొగసైన వర్ణ సంపదని
విహరించి చాటించె వనరాణి తానెయని
                                              -- జాగృతి 🪷 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - కరకు రాతి రూపు
కరుణ నిండిన చూపు
తోడు నీడై నడుపు
    ఉనికి నే మేల్కొలుపు
                                   -- జాగృతి 🪷  - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - నీకోసం నేనున్నానని
పలికే ఆ ఒక్క స్వరం 
కలిమైనా, లేమైనా 
వెనుకాడని ఒక పయనం

విధి ని సైతమెదిరించి
విడనాడవనే  ఒక ధైర్యం
మనసున మనసై నిలిచి
జతగూడే మన బంధం ❤ - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - వెన్నెల కాంతిని నేనై
            వెలుగుల ఱేడువు నీవై
ఎదలోయల నిదురించే
         అందమైన చెలికాడామల్లెపూల సుగంధమై
మనసు సేద తీర్చనా
పిల్ల గాలి తెమ్మెరనై 
నీ ముంగురులను సవరించనా

బిగికౌగిట బంధించి
నీ శ్వాసలో లయించనా
నీవే నేనై నిలిచిన
ఈ రేయిని నిలిపేయనా - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - కదలని కన్నులనేమని అడుగను
మది నీ రూపము నింపే వేళమెదపని పెదవులనేమని అడుగను
మధురామృతమవి గ్రోలే వేళముడిపడు కరములనేమని అడుగను
నీ మృదు స్పర్శకు మురిసే వేళనిలువని అడుగులనేమని అడుగను
నీ సందిట నను నిలిపే వేళ - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - చిరుగాలి తెలిపింది 
               నీ శ్వాస లో లయని
వనమెల్ల మురిసింది
                   నీ  పదములో సడి విని
ఝుమ్మంది తుమ్మెద
             నీ మేని  సొగసు గని 
పూలన్ని వికసించె 
       నీ పాద   సేవకని

మనసెంతో మురిసింది 
వచ్చె నా రాముడని 🙏


 
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa -          కొంగున ముడి వేసి నిన్ను
             కౌగిట బంధించనా
సరిగంచు పరదాల
          తెరచాటు దాచనా
ఉదయ కిరణాలతో 
               హృదయ రాగం కలిపి
కడలి కెరటాల పై
              సయ్యాట లాడనా

 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - He*art pic*ks - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - సూర్య కిరణము లోని
వెలుగు తేజము నీవు
చంద్ర కిరణము పంచు
చల్లదనము నీవు
వాగ్దేవి దీవించు 
కావ్య కన్యక వీవు
ప్రేమానురాగాల
ప్రియ ❤రాధ❤ నీవు


 







ఒడిజేర్చి లాలించి
 అఘములన్ తొలగించి 
మా కొరకె తపియించు 
ఓ మాతృమూర్తి
గురువు, దైవము నీవే
సర్వ శక్తి వి నీవే


నీ ప్రేమ పొందుటకు, నిన్ను సేవించుటకు 
జన్మ జన్మల యందు
నీకె జనియించగా
వరమునందీయుమా
మా దివ్య ❤జనని❤
 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

K
Krishnaa
Quote by Krishnaa - నిండు జాబిలి నందు 
నీ మోము గాంచనా
మేరు పర్వతమందు 
నీ రూపమెంచనా
కడలి గలగలలన్ని 
నీ సవ్వడేనా 
మలయమారుతమందు 
నీ గానమేనావెన్నెలై నిను జేరి 
           నే ప్రకాశించనా
పుడమినై నీ పదములన్
               మదిని మోయనా
అనురాగ మూర్తి నీ
                   హృదయారవిందాన
అనురాధ నై నేను
               కొలువుండిపోనా

 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - చిరుగాలి తెమ్మెరలు 
                 చెంపలను తాకంగా
     మధురోహలతో మనసు
          హాయి సలుపంగా



సన్నజాజుల తావి
             పరవశానూగంగా
   నీ మోముపై నగవు
                 మదిలోన  మెరయంగారావేల కృష్ణయ్య 
          నన్ను బ్రోవంగా
నీ రాధనున్ జేర
            ప్రేమ మీరంగా
💖💖💖💖💖💖
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - ప్రత్యూష పవనాల హాయిగొల్పు వేళ
పద్మరాగాల నాస్వాదించు వేళ
చైతన్య కిరణాలు స్వాగతించే వేళ
ఆత్మీయ నేస్తానికి కావాలి
ఆనందహేల


🌺శుభోదయం 🌺
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - నవయుగాదికి స్వాగతమనుచూ
వసంత కోకిల విరాన కూసెను

నూతనోత్తేజ భరిత మౌననుచు
చైత్రలక్ష్మి దీవించె జనులను

షడ్రుచుల మేలి కలయికే ననుచు
జీవనశైలిని ఉగాది తెలిపెను

కొత్త ఆశలతో ముందుకు సాగుచూ
🌺విశ్వావసు🌺నకు శుభ స్వాగతం
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - తమోగుణ రూపమగు తాటకిని వధియించి
రజోగుణ తేజ నహల్యను సంస్కరించి
సత్వగుణశీలి సీతనున్ చేపట్టి
త్రిగుణాలకున్ అతీతమౌ నీ మూర్తి
దర్శింప మా భాగ్యమే
🙏రామచంద్రా 🙏

 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - నీలాకృతిని జూచి మేఘమచ్చెరువొందె
తమ వర్ణమునకెంత శోభగల్గెనో యనికరమందు వేణువుని కనులార వీక్షించి
వెదురు ప్రణమిల్లె తమజన్మ ధన్యంబనిశిఖరాగ్రస్ధానమున పింఛమై నిలిచుండ
పరవశంబున నాట్యమాడేను నెమలి
నీ ప్రేమ జవిగొన్న గోమాత ధన్యమే
నీ పాద సేవయే మాకునున్ జాలునే 

 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - మావికొమ్మల మాటు
                        దోబూచులాటేల
మేఘమాలల నడుమ
                        సయ్యాటలేలా
పడుచు జంటల మదిని
                      కవ్వించగానేల
            హృదయ  సంద్రమున అలల 
                       ఉలికిపాటేలా







                     
చెలికాని జతచేర 
                     ఆరాటమదియేల
వెండి వెన్నెల గ్రోలు
                    చకోరమవనేలా
హృదయ సందేశమును
                  తెలుసుకోవేలా
ప్రియ సఖిని కరుణించ
                      నింగి దిగి రావేల - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - అరవిందములా కన్నులు జూడరే
కరమందుననా వేణువు గాంచరే
మరకతశ్యాముని మదిలో నెంచరే
పరమాత్ముని సేవించగ రారే - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - నిశ్చల ప్రశాంత సంద్రము నీవు
జోరు కెరటాల తీరమే నేను

ప్రచండ భానుడి తేజం నీవు
తట్టి లేపు నీ కిరణమే నేను

సుందర హిమనగ  సౌరభమె నీవు
మలయ మారుత సరాగమే నేను

అనంత కాల విశ్వమే నీవు
నీలో సగమై, నీవైన  నేను 



 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - రాయంచ నను అడిగే 
            నీ తోడు యెవరని
రమణీ మనోహరుడు
              యెచట నున్నాడని

ఏ రీతి  నిను దెల్ప, 
            ఏ రూపునన్  జూప
వేకువై, వెలుగువై
            సంద్రమై, అలవై


నా కంటి  దీపమై
              నా గుండె లయవై
నాలోన లీనమై
              నా ప్రాణ సమమై

అంతటన్ నీవె మరి 
అన్నిటన్  నీవెగా
💖💖💖💖 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

K
Krishnaa
Quote by Krishnaa - శతపత్ర కమలాల 
          నిన్ను సేవించనా
శతయోజనాలైన
          నిన్ను జేరగ రానా
శతకోటి సూర్య భాసితంబౌ
       నిను జూడ
జన్మించనా నేను
            శతజన్మలైనా
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - చిదానంద  రూపః
           శివోహం శివోహం
చిదానంద రూపా
          శివోహం శివోహం
చిదానంద రూపః
           శివోహం శివోహం - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - బాలచంద్రుని జూడ 
            భాగ్యమేమని తెల్ప
ఫాలనేత్రుని సిగను
       అలరారుచుండే


నాగేంద్రునిన్ జూడ
         దర్పముల్ దీరవా
కందర్పునిన్ కంఠ 
   మలయంగనే
నందీశునన్ జూడ
         పరవశంబే కదా
పరమాత్మునిన్
     దర్శనంబీయగన్

 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - సంద్రమునై నీ పదములజేరనా
సమీరమై  నిను సేదదీర్చనా
సంధ్యా సమయపు హాయిగొల్పనా
మధురోహలతో మనసు నింపనా

నిను సేవించగ 
        జన్మ తరించును
నీ పద కమలమే
           మాకు శరణ్యము 
🪷🪷🪷🪷 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa -     మనసు తీర్చగలేను,
 వీడి మనలేను
  దరికి చేరగలేను,
 దరిజేర్చుకోను

నీ దివ్య వీక్షణలే 
నను నడుపు శక్తి
నీ తేజ కిరణములే 
నా జీవధార

నీ చరితచర్వణమే 
నా ధర్మపధము
ధరణినై  నాకిదే
జన్మ సాఫల్యము








 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - రాగమాలిక నై నీ మురళినందుండనా
వెన్నకుండగ మారి నీ చేతజిక్కనా
కలువలన్ జేరి నీ ఎదను నిదురించనా పదకంకణముగ నీ నర్తనన్ జూడనా

ఏ రూపునన్ దాల్చి నిన్ను జేరుదునో
ఏ రీతి నా జన్మ సాఫల్యమందునో
నా తలపు నా పలుకు 
నా తపము నీవే
నీ చరణ కమలములే 
నాకిహము పరము
🙏🙏🙏🙏 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - మరుని  శరమ్ముల  విరిబాణము వలె
నీ చూపులు నను తాకగనే
కానరాని అలజడి ఏదో మరి
ఉప్పెన లై ఎద పొంగెనులే

శరత్పౌర్ణమీ శశికిరణము వలె
నీ దరహాసము కాంచగనే
రసరంజితమౌ జలధారలతో
మానస సంద్రం మురిసెనులే

తగునా నీకిది వనమాలీ..... 
తగునా తరుణీ  మానస చోరా... 
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - అరుణిమ కాంతుల స్వాగతమవనా
పరిమళ సోయగ పుష్పమునవనా
మధుర గాన ప్రియ కోకిలనవనా
మయూరి నై అలరించగ రానా

వసంత శోభల వయ్యారమంతా
నీ సందిట నే చిలకరించనా
ప్రకృతి కాంతనై పరవశించనా
నీ పద స్పర్శ కు పులకరించనా
 - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - జాబిలి మోమును చూడగనే
 నీ వదనం మది తలచెదనే
శశికిరణం నను తాకగనే 
అలలై ఎగసెను మానసమే
కన్నులార నిను కాంచగనే రసమయమైనది నా జగమే
కలువను నేనై విరిసెదనే 
నీవే మరి నా ప్రపంచమే - Made using Quotes Creator App, Post Maker App
K
Krishnaa
Quote by Krishnaa - కృష్ణస్య స చరాచరం 
🙏🙏🙏🙏 - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.